Site icon NTV Telugu

Fish Venkat: ఫిష్ వెంకట్ కి హీరో ఆర్థిక సహాయం

Fish Venkat

Fish Venkat

నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం కూతురు స్రవంతికి PRK హాస్పిటల్ లో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించారు హీరో కృష్ణ.

Also Read:Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో “తిమ్మరాజుపల్లి టీవీ”

ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ 100 Dreams Foundation లో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు – అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలని సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితం,” అని తెలిపారు.

Exit mobile version