సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే… రామ్ చరణ్ ‘బ్రూస్లీ’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ చేరువయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ‘బోర్డర్’ అనే పేరు ఖరారు చేశారు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సామ్ సి.ఎస్. స్వరాలు అందిస్తున్న ‘బోర్డర్’లో రెజీనా కసండ్రా, స్టెఫీ పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే చివరి వారంలో విడుదల చేస్తామని నిర్మాత విజయ్ రాఘవేంద్ర చెబుతున్నారు.
అరుణ్ విజయ్ ‘బోర్డర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!
