Site icon NTV Telugu

Fahadh Faasil : పాత్రల ఎంపికలో లాజిక్ ఉండాలి..

Fahadh Faasil

Fahadh Faasil

డిఫరెంట్ క్యారెక్షలు ఎంచుకుంటు.. వరుస విజయాలతో తనదైన ముద్ర వేసుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ‘పుష్ప’ మూవీ‌తో తెలుగు ప్రేక్షకులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు వడివేలు‌తో కలిసి నటించిన కామెడీ థ్రిల్లర్ ‘మారీశన్’ చిత్రంతో ప్రేక్షకుల‌ను పలకరించనున్నారు. జూలై 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read : Kingdom : ‘కింగ్‌డమ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..

తన పాత్రల ఎంపిక వెనక గల ఆలోచనల గురించి చెబుతూ.. ‘ఏ పాత్ర అయినా లాజిక్ లేకుండా ఎంచుకోను. గతేడాది విడుదలైన ‘వేట్టయన్’ సినిమాలో నేను తొలుత ప్లాన్ చేసిన క్యారెక్టర్ కాకుండా, స్వయంగా ‘ప్యాట్రిక్ అలియాస్ బ్యాటరీ’ అనే పాత్రను ఎంపిక చేసుకున్న. ఆ నిర్ణయం వల్ల దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు. మనకు గుర్తింపు రావాలంటే పాత్ర ఎంపికలో లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఇక వ్యక్తిగతంగా చెప్పాలి అంటే నేను సోషల్ మీడియా కు పూర్తిగా దూరం. వాట్సాప్ కూడా వాడడం మానేశాను. ఇప్పటికి సంవత్సరం దాటింది.. సాదా మొబైల్‌ వాడుతున్నాను. సినిమాలకు సంబంధించిన కమ్యూనికేషన్ మొత్తం ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది’ అని అన్నారు.

Exit mobile version