Site icon NTV Telugu

Exclusive : మహేశ్ – రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Ssmb 29 (2)

Ssmb 29 (2)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ శనివారం సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం GlobeTrotter పేరుతో హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వచించబోతున్నారు. అందుకు సంబంధించిన పాస్ లు కూడా ఫ్యాన్స్ కు అందజేస్తున్నారు మేకర్స్.

Also Read : Tamannaah : బ్రేకప్ తర్వాత ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేస్తున్న మిల్కీ బ్యూటీ

కాగా ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసారని టాక్. శనివారం జరగాయబోయే ఈవెంట్ లో ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నారు. వారణాసి టైటిల్ కు సంబందించి పోస్టర్ లు కూడా రెడీ చేసాడని సమాచారం. కాగా ఈ వారణాసి టైటిల్ పోస్టర్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసాడట రాజమౌళి. విశ్వసనీయ సమాచారం మేరకు వారణాసి సినిమాను 2027 మార్చి 25న రిలీజ్ చేయబోతున్నారట. అందుకు సంబంధించి షూటింగ్ ను ఫినిష్ చేసేలా షెడ్యూల్ కూడా ప్లాన్ చేసాడు జక్కన్న. ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన పృద్వి రాజ్ సుకుమారన్ లుక్ కు మిశ్రమ స్పందన రాగ మందాకినీగా వచ్చిన ప్రియాంక చోప్ర ఫిస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రుద్రగా రాబోయే మహేశ్ లుక్ ఎలా వుండబోతుందనే దానిపై ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. GlobeTrotter ఈవెంట్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version