నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్యారడైజ్‘. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్యారడైజ్. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది.
నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడనేదానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. దీనికి ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24 గురువారం నాడే భారీ స్థాయిలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరికీ ‘ది ప్యారడైజ్’ టీమ్ ముందస్తు సమాచారాన్ని అందించింది. రిలీజ్ కు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే చిత్రానికి సంబంధించి మిగిలి ఉన్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయితేనే ఈ తేదీల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో మేకర్స్ ప్లాన్ చేసినట్లుగానే సెప్టెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

