Site icon NTV Telugu

Erracheera: వణికిస్తున్న ఎర్ర చీర యాక్షన్ ట్రైలర్

Erra Cheera

Erra Cheera

Erracheera Action Trailer: శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా మూవీ ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ ను మంగళవారం నాడు దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేసి సినిమా యూనిట్ ని అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8 న విడుదల కాబోతోన్న క్రమంలో యాక్షన్ ట్రైలర్ పేరుతో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఆ ట్రైలర్ చూస్తుంటే ఒక పక్క భయపెడుతూనే మరోపక్క యాక్షన్ కట్స్ అన్నీ చూపించారు.

Kumari Aunty: మీడియాను నేను పిలిచానా.. పోలీసులపై కుమారి ఆంటీ ఫైర్

ఇక ఈ సినిమాలో ఎంతో అధ్బుతమైన 45 ని|| గ్రాఫిక్స్ హైలైట్ అని సినిమా టీం చెబుతోంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబి సాయి తేజస్విని అద్భుతంగా నటించింది, కారుణ్య చౌదరి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ తదితర టాలెంటెడ్ ఆర్టిస్టులతో నిర్మించిన ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ – సౌండ్ ఎఫెక్ట్స్ అందించినట్టు సమాచారం. చందు సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి గోపి విమల పుత్ర డైలాగ్స్ అందించారు.

Exit mobile version