NTV Telugu Site icon

Veekshanam: సిద్ శ్రీరామ్ ‘ఎన్నెన్నో..’ సాంగ్ భలే ఉందే!

Ennenno

Ennenno

Ennennenno lyrical Song from “Veekshanam” out now: యువ హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నెన్నో…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ప్రేయ‌సి ప్రేమ‌లో మునిగిన ప్రేమికుడి మ‌న‌సు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది.

Pushpa 2: 100 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!

స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను రెహ్మాన్ రాయ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాంగ్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే కనుక షూట్ ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను త్వ‌ర‌లోనే అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.