Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు

Average Student Nani

Average Student Nani

Emaindho Manase Song from Average Student Nani Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కాబోతోన్న ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

×
×
Ad

గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు. రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీలు అందించగా శక్తి శ్రీ గోపాలన్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉండగా పవన్, సాహిబా భాసిన్ స్టీమీ కెమిస్ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్. వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.