Site icon NTV Telugu

Gold Bar Challenge: హీరోయిన్లతో సందడిగా వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్

Eesha Rebba

Eesha Rebba

నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall)లో వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొన‌సాగింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, “బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతినిస్తాయి. వింధ్య గోల్డ్‌ వంటి నమ్మకమైన బ్రాండ్‌ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని అన్నారు. గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు ఈషా రెబ్బ సంద‌డి చేసి ఉత్సాహ‌ప‌రిచారు.

ఆ మరుసటి రోజు హీరోయిన్ ధన్య బాలకృష్ణ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, “వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు. ఆమె సందర్శకులతో కలిసి ఛాలెంజ్‌లో పాల్గొని, వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Exit mobile version