NTV Telugu Site icon

UnstoppableS4 : దుల్కర్ చెప్పిన 12వ తరగతి ప్రేమ కథ..

Usb2

Usb2

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -4 గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. హుషారైన మాటలతో అన్ స్టాపబుల్గెస్ట్ లతో బాలయ్య ఆట, పాటలతో షో ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు బాలయ్య. సీజన్ 4 కు మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు తో బాలయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు గాను మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు.

దుల్కర్ తో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రశ్నలు పంచులతో ఆద్యంతం సరదాగా సాగింది. అందులో భాగంగా దుల్కర్ అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం పై ప్రశ్నలు వేసాడు.అందుకు బదులుగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..” నా భార్య అమల్ సూఫియా నా స్కూల్ లో నాకు జూనియర్. నేను 12వ తరగతి చదివేటప్పుడు ఆమె 8వ తరగతి. కానీ ఆ టైమ్ లో మేము ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చెన్నైలోను సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ లో ఫ్రెండ్స్ తో కనపడేది. కొన్నాళ్ల  తర్వాత నాకు ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. దాంతో  నేనే తనకు ఫేస్ బుక్ లో మెసేజ్ చేశాను. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మీ ఇంట్లో కూడా నీకు చూస్తుంటారు. మనం ఒకసారి కలిసి ఎందుకు మాట్లాడుకోకూడదనుకున్నాం. అలా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పటికి మా పెళ్లయి 13 ఏళ్ళు అయింది. అప్పటికి ఇప్పటికి అంతే ప్రేమగా ఉన్నాం” అని తెలిపారు.

Show comments