‘చినుకు చినుకు అందెలలో… ‘ పాట గుర్తుందా? ఎవరూ ఊహించని విధంగా బాబూ మోహన్ తో సౌందర్యని డ్యాన్స్ చేయించాడు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. అదే పాటకి మరోసారి ఆలీతోనూ సౌందర్య స్టెప్పులేసింది!
ఆగస్ట్ 8న ఆదివారం వేళ జీ తెలుగులో ప్రసారం అయ్యే ‘డ్రామా జూనియర్స్’లో బాబూ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి జడ్జీలుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. అలా క్రేజీ కాంబినేషన్ అయిన బాబూ మోహన్, ఆలీ, ఎస్వీ ఒక్క చోట కనిపించబోతున్నారు!
Read Also : రివ్యూ: ఎస్.ఆర్. కళ్యాణ మండపం
ప్రతీ వారంలాగే ఈసారి కూడా ‘డ్రామా జూనియర్స్’లో పిల్లలు అద్భుతంగా కామెడీ చేయనున్నారు. అలాగే మనసు ఆలోచింపజేసే స్కిట్స్ కూడా ప్రొమోలో కనిపిస్తున్నాయి. వాటికి మరి మన హాస్య నటుడు, రాజకీయా నాయకుడు అయిన బాబూ మోహన్ ఎలా స్పందిస్తారో చూడాలి…
