Site icon NTV Telugu

Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”

Bhairathi Ranagal

Bhairathi Ranagal

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన “భైరతి రణగల్” సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ “మఫ్తీ”కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

Nabha Natesh : చక్కగా చీరకట్టి చిక్కటి అందాలను చూపిస్తోన్న నభా నటేశ్

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలో ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. “భైరతి రణగల్” చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు. తెలుగులోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న శివరాజ్ కుమార్…”భైరతి రణగల్” మూవీతో ఇక్కడా మంచి విజయాన్ని అందుకోబోతున్నారు. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్, రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ , చాయా సింగ్, ఉదయ్ మహేశ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version