Site icon NTV Telugu

Disco Santi Emotional: బావ చనిపోయిన తర్వాత.. బాలయ్య ఒక్కరే కాల్​ చేశారు

Disco Santi Emotional

Disco Santi Emotional

Disco Santi Emotional: రియల్‌ హీరోగా తన లైఫ్‌ లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌ గా ఇలా భిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి నటుడు శ్రీహరి. అయితే ఆయన 2013 అక్టోబర్ 9న అకస్మాత్తుగా కన్నుమూసారు. ఓ సినిమా షూటింగ్ లో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతోనే శ్రీహరి మృతి చెందారని భార్య డిస్కోశాంతికి ఫోన్‌ రావడంతో.. కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు చేరుకుని సంతాపం తెలిపారు. అక్కడితోనే అయిపోయిందని ఆతరువాత వారి కుటుంబాన్ని ఎవరు పలకరించలేదు, పట్టించుకోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై తన మనసులోని బాధను డిస్కోశాంతి చెబుతూ ఎమోషన్‌ అయ్యింది.

బావ (శ్రీహరి) కన్నుమూసిన తరువాత ఎవరూ పలకరించడానికి కూడా రాలేదని, తమకు డబ్బులివ్వాల్సిన వారు చాలామంది ఎగ్గొట్టారని కన్నీరు పెట్టుకుంది. అప్పులు తీర్చేందుకు తన నగలు, కార్లు అమ్ముకున్నానని చెప్పుకొచ్చింది. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ సరిగా ఇచ్చి ఉంటే, నేను మరో పది ఇళ్లు కొని ఉండేదాన్నని చిరంజీవితో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రం క‌రెక్ట్‌గా రెమ్యునరేషన్​ ఇచ్చేవాళ్లు.. చాలా మంది డ‌బ్బులు ఇచ్చేవారు కాదు. తర్వాత ఇస్తామనే వాళ్లు, అయితే బావ‌కు సినిమా అంటే పిచ్చి, అందుకే నేను కూడా డ‌బ్బులు ఇవ్వక‌పోయినా పర్లేదు, సినిమాలు చేయ‌మ‌ని చెప్పేదాన్ని. మీ వయస్సు 40-50 ఏళ్లు వ‌చ్చినా తండ్రిగానో.. అన్నగానో ఏదో ఒక వేషం వ‌స్తుంది అంటూ ప్రోత్సహించేదాన్ని దానికి ఆయనకు కూడా ఆసక్తి కదా, అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఇదే అలుసుగా తీసుకున్న వారు డబ్బులు ఇవ్వాల్సిన చాలా మంది బావ చనిపోయిన తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

దీంతో.. మేం చేసిన అప్పులు తీర్చడం కోసం నగలు, కార్లు అమ్మానని చెప్పుకొచ్చారు. అదే నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే, బావ చనిపోయిన తర్వాత, శాంతి ఏం చేస్తుందని ఆరా తీసేవారేమో అంటూ భావోద్వేగానికి గురైంది. అయితే ఇప్పుడు నేను సినిమాలకు దూరంగా వున్నాను కాబట్టి తన కుటుంబాన్ని తనను ఎవరూ ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకుంది. అయినా ఇండస్ట్రీలో ఇవన్ని మాములే, అంటూ ఇండస్ట్రీ వున్న వారికే గానీ, లేనివారికి కాదు అంటూ తన మనసులో మాటలను చెప్పకనే చెప్పింది డిస్కోశాంతి. అయితే.. శ్రీహరి చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ మా ఇంటికి కాల్‌ చేశారు. బాలకృష్ణ సినిమాలో బావ (శ్రీహరి) ఏదో ఒక క్యారెక్టర్‌ చేశారట, దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్‌ ఉన్నాయా? అంటూ ఏమైనా సాయం కావాలా? అని అడిగారు. అయినా బాలకృష్ణకి అలా ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు, అయినాకానీ, ఆయన కాల్‌ చేసి మా బాగోగులు ఆరా తీశారు. మా బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాల‌కృష్ణలా ఎవ‌రూ కాల్ చేయ‌లేదు అన్నారు శాంతి.
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి దీపక్ హుడా అవుట్..!!

Exit mobile version