టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ విషయాన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భారత్ నారంగ్, పి రామ్ మోహన్ లతో కలిసి ధనుష్ ను హైదరాబాద్ లో మీట్ అయ్యారు.
Read Also : హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ “మహా” టీజర్
ఇటీవలే అమెరికాలో “గ్రే మ్యాన్” షూటింగ్ ను పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చాడు ధనుష్. అయితే ఆయన డైరెక్ట్ గా తన సినిమా “D43” షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ మీటింగ్ లో శేఖర్ కమ్ముల ఈ టాలెంటెడ్ హీరోతో స్క్రిప్ట్ గురించి చర్చించారు. ఈ బృందం ప్రస్తుతం వివిధ భాషలకు చెందిన కొంతమంది ప్రతిభావంతులైన నటులతో, ప్రఖ్యాత సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ధనుష్ చివరిసారిగా “జగమే తందిరం”లో కనిపించాడు. హిందీ చిత్రం “అత్రాంగి రే” షూటింగ్‌ను కూడా ఆయన పూర్తి చేశారు.
