డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ ఉంటారు . అయితే.. ప్రతీ విషయంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదకా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతూ.. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈయన నేడు పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చకు దారితీసింది. తాను నిర్మించిన సినిమా లడ్కి సినిమా పై ఓ నిర్మాత కేసు నమోదు చేయడంతో.. ఆయన పోలీస్టేషన్ కు వెల్లారు. వర్మ నిర్మించిన లడ్కి సినిమాను ఆపాలంటూ.. నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనేపథ్యంలో.. ఇదే అంశంపై నేడు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేయనున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే నిర్మాత శేఖర్ రాజు, వర్మ మై ఫైర్ అయ్యారు. ఓ సినిమా చేయడం కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు ఇచ్చానని, కానీ ఆడబ్బులు ఇచ్చేందుకు డైరెక్టర్ వర్మ దాటేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తన దగ్గర వున్న ఆధారాలతోనే కోర్టను ఆశ్రయించానని నిర్మాత శేఖర్ రాజు వివరించారు. స్పందిచిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన లడ్కి సినిమాను అన్ని భాషల్లో నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వలు జారీ చేసింది. మరి ఈ విషయంపై పంజాగుట్ట పోలీస్టేషన్ మెట్లెక్కిన వర్మకు న్యాయం జరగనుందా? అనే అంశంపై అభిమానుల్లో ప్రశ్నార్థకంగా మారింది.
Telangana BJP Politics : బీజేపీలో వలస నేతలకు పడటం లేదా ? ఈటలపై ఎందుకు నారాజ్ అవుతున్నారు ?
