డైరెక్టర్ హరీశ్ శంకర్ మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు రూపొందించాడు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వర్క్ చేయలేదు. 2006తో షాక్తో మొదలైన హరీశ్ శంకర్ దర్శకత్వ ప్రస్థానం ఈ పదిహేనేళ్ళలో ఏడు చిత్రాలు తీసేలా చేసింది. ఎనిమిదో చిత్రం పవన్ కళ్యాణ్ తో మైత్రీ మూవీ మేకర్స్ కోసం చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో మూవీస్ చేశాడు హరీశ్ శంకర్. బేసికల్ గా మంచి రచయిత కూడా అయిన హరీశ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ను, సన్నివేశాలను తన సినిమా కోసం రాసుకుంటాడు. అలానే తోటి రచయితలంటే అతనికి బోలెడంత గౌరవం కూడాను. అలాంటి హరీశ్ శంకర్ త్వరలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోయే ఓటీటీ ప్రాజెక్ట్ కు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. విశేషం ఏమంటే… దానికి కథను మరో దర్శకుడు దశరథ్ అందిస్తున్నారు. వీళ్ళిద్దరూ దిల్ రాజు క్యాంప్ కు చెందిన వాళ్ళే కావడం విశేషం. ఓ కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తాట. ఇది ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడిగా గీతా ఆర్ట్స్ లోకి అడుగు పెట్టకపోయినా… నిర్మాణ భాగస్వామిగా ఆ క్యాంప్ లోకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ ఎంట్రీ ఇవ్వడం గ్రేటే!
గీతా ఆర్ట్స్ తో హరీష్ శంకర్!

harish shankar