Cinema Terminology : సినిమా లైన్, ప్లాట్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కి తేడా ఏంటో తెలుసా?

Indias National Cinema Day

Indias National Cinema Day

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక సినిమా తయారీకి లేదా కథ రచనకు వచ్చేసరికి ‘లైన్’, ‘ప్లాట్’, ‘స్క్రీన్ ప్లే’, ‘స్క్రిప్ట్’ అనే పదాలను తరచూ ఉపయోగిస్తుంటాం. చాలా మందికి ఇవి ఒకేలా అనిపించినా, సినిమా రూపకల్పనలో వీటికి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం:

1. సినిమా లైన్

సినిమా లైన్ అంటే ఆ సినిమా కథాంశం Core Idea. ఒక వాక్యంలో లేదా రెండు ముక్కల్లో సినిమా అసలు దేని గురించి చెబుతుందో తెలిపేదే ‘లైన్’. ఉదాహరణకు, “ఒక సామాన్య యువకుడు తన తండ్రి మరణానికి కారణమైన విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?” అనేది ఒక సినిమా లైన్ అనుకోవచ్చు. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే.

2. ప్లాట్

లైన్‌ను మరింత విస్తరిస్తూ రాసే సంఘటనల క్రమం (Plot Structure). కథలో ఏ ఘటన తర్వాత ఏది జరుగుతుంది? హీరోకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? ఇంటర్వెల్ బ్లాక్ ఏమిటి? క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది? వంటి ప్రధాన సంఘటనల దారాన్ని ‘ప్లాట్’ అంటారు. ఇది కథలోని పాత్రల ప్రయాణాన్ని వివరిస్తుంది.

3. స్క్రీన్ ప్లే

ప్లాట్‌ను సినిమా రూపంలో విజువల్‌గా తెరపై ఎలా చూపించాలనే దాని బ్లూప్రింట్ . ప్లాట్‌లో ఉన్న కథను కెమెరా ముందు ఎలా ఎెక్సిక్యూట్ చేయాలో స్క్రీన్ ప్లే నిర్ణయిస్తుంది. ఏ సీన్ ఎక్కడ మొదలవ్వాలి, ఏ పాత్ర ఎలా మాట్లాడాలి, బ్యాక్‌గ్రౌండ్ మూడ్ ఎలా ఉండాలి, సస్పెన్స్ లేదా ఎమోషన్స్ ఎలా పండించాలి అనే టెక్నికల్, డ్రామాటిక్ ప్రెజెంటేషన్ అంతా స్క్రీన్ ప్లే కిందకే వస్తుంది. దర్శకుడి విజన్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

4. స్క్రిప్ట్

సినిమాకు సంబంధించిన పూర్తి వ్రాతప్రతి (Complete Document). ‘స్క్రిప్ట్’లో స్క్రీన్ ప్లేతో పాటు, పాత్రల మధ్య జరిగే సంభాషణలు (Dialogues), లొకేషన్ల వివరాలు, యాక్షన్ మ్యాటర్స్ అన్నీ కలిపి ఉంటాయి.