Site icon NTV Telugu

Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..

Dhruv

Dhruv

ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘బైసన్’. తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘బైసన్’ను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను. నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్‌లా ఉన్నారు’ అని అన్నారు. అవును నేను ఆయన కొడుకుని అని చెప్పాను. మా నాన్న  కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను. నాకు తెలుగులో నటించాలని ఉంది.

Also Read : Pawan Kalyan : ‘OG’ సినిమాపై కాపీ ఆరోపణలు చేసిన కన్నడ దర్శకుడు..

‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్నలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. ‘మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్‌ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ చూడండి’ అని అన్నారు.

Exit mobile version