కోలీవుడ్ దసరా బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు రజనీకాంత్ అండ్ ధనుష్. అక్టోబర్15న జైలర్2 రిలీజౌతోంటే.. మరుసటి రోజే ఓమ్ రాబోతోంది. జైలర్2 వాయిదా పడుతుందన్న రూమర్స్ వస్తుండటంతో టీమ్ స్పీడ్ పెంచి.. వరుస అప్డేట్స్‌తో రజనీ ఫ్యాన్స్‌కు ఊపిరాడకుండా చేస్తోంది. కానీ ధనుష్ ఓం మూవీ టీమ్ మాత్రం సైలెంట్‌గా వర్క్ చేసుకుంటోంది. రెండు వారాల క్రితం మలయాళ హీరో మమ్ముట్టి క్యారెక్టర్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. కానీ అప్పటి నుంచి నో అప్డేట్స్.
అమరన్ తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓమ్‌లో సాయి పల్లవి అండ్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి లుక్ రివీల్ చేయలేదు మూవీ టీం. ఇక అప్‌డేట్స్ సంగతి సరే సరి. ఎక్కడా ప్రమోషన్స్ హడావుడి కనిపించకపోవడంతో సినిమా రిలీజ్ ఉంటుందా, పోస్ట్‌పోన్ అవుతుందా అనే రూమర్స్ కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. అక్టోబర్ మిస్ అయితే నవంబర్ 27 లేదా డిసెంబర్ 2న మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ధనుష్ ఫ్లాప్స్ పట్టించుకోకుండా స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఇడ్లీ కడాయ్‌కి క్లిటిక్స్ నుంచి ప్రశంసలు రాగా ఈ ఏడాది వచ్చిన ‘కర’ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దాంతో ఓమ్ మూవీతో ఆ లెక్కలు సరిచేస్తాడని ఫ్యాన్స్ ఫీలౌతున్నారు. నెక్ట్స్ తమిరళసన్ పచ్చముత్తు డైరెక్షన్‌లో డీ56 ప్లాన్ చేస్తున్నాడు ధనుష్. అయితే ‘థెనండల్ మురళి’, ‘ఫైవ్ స్టార్ కతిరేసన్’లతో ధనుష్‌కు ఉన్న పాత ఆర్థిక వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చినట్లు సమాచారం. తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు తదుపరి సినిమా పట్టాలెక్కకూడదని ఆ ఇద్దరూ నిర్మాతల సంఘాన్ని కోరుతున్నట్లు సమాచారం. మరి ఈ వివాదాలకు ధనుష్ ఏవిధంగా చెక్ పెడతాడో చూడాలి.

