Site icon NTV Telugu

రిలీజ్​కు ముందే పైరసీ బారిన ధనుష్ సినిమా

ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే​ పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు​ వెబ్​సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్​ దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది.

Exit mobile version