‘జగమే తందిరం’ తమిళ చిత్రం జూన్ 18న ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘జగమే తంత్రం’గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో టాలెంటెడ్ కోలీవుడ్ స్టార్ మరోసారి గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నాడట. గతంలోనూ గ్యాంగ్ స్టర్ పాత్రలు ధనుష్ చేశాడు. అయితే, ‘జగమే తంత్రం’ సినిమాలో మాత్రం అతడి క్యారెక్టర్ సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉంటుందట!
హీరో ధనుష్ లాగే ‘జగమే తంత్రం’ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా రజనీకాంత్ ఫ్యాన్ కావటంతో సినిమాలో ఆయన ప్రభావం పక్కగా పడిందట. ముఖ్యంగా, ధనుష్ క్యారెక్టర్ పైన తలైవా ఇన్ ఫ్లుయెన్స్ ఉటుందట. ఇంతకు ముందు ధనుష్ కావాలనే సూపర్ స్టార్ ఛాయలు తనపై పడకుండా జాగ్రత్తపడ్డానని చెప్పాడు. కానీ, ఈసారి కార్తీక్ సుబ్బరాజ్, తానూ ఇద్దరూ ‘పడయప్ప’ ఫ్యాన్స్ కావటంతో ఆయన ప్రభావం ప్రేక్షకులకి కనిపించేలా సినిమా రూపొందించారట! చూడాలి మరి, జూన్ 18న ధనుష్… ఇటు తన ఫ్యాన్స్ ని, అటు మామగారు రజనీ ఫ్యాన్స్ ని… ఏక కాలంలో ఎలా అలరిస్తాడో!
