NTV Telugu Site icon

Mass 4K : థియేటర్ స్క్రీన్ కోసం బౌన్సర్లు.. ఇదెక్కడి మాస్ రా మావా

Mass

Mass

Devi Theater Management appointed Bouncers for Mass 4K Screening: ఈ మధ్యకాలంలో పాత సినిమాలను బాగా రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయింది. హీరో పుట్టినరోజునో లేక సినిమా రిలీజ్ అయిన వార్షికోత్సవం అనో వాటిని రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి మరీ యూత్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే థియేటర్లలో పరిస్థితులు శృతిమించి ఒక్కోసారి కుర్చీలను ధ్వంసం చేసి మరోసారి తెరను ధ్వంసం చేసిన ఘటనలు కూడా అనేకం నమోదయ్యాయి. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ దేవి థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాని 4k వెర్షన్లో రీ రిలీజ్ చేశారు.

Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాపై కలకలం.. నిర్మాతలకు నోటీసులు..

అయితే యువత థియేటర్ స్క్రీన్ దగ్గరకు వెళ్లి హంగామా చేస్తుందని ఉద్దేశంతో వాళ్లను అక్కడికి ఎక్కనివ్వకుండా బౌన్సర్లను నియమించారు. దీంతో బౌన్సర్లు యువత స్క్రీన్ వరకు రాకుండా చూసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో చూసుకుంటే మాస్ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధియేటర్లలోని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో సంస్థ రీ రిలీజ్ చేసింది. మొదటిరోజు కావడంతో ఈరోజు గట్టిగానే థియేటర్ల దొరికాయి. రేపు సరిపోదా శనివారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు మాత్రం థియేటర్లో ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. దీంతో కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments