NTV Telugu Site icon

Devara : కసి తీర్చుకున్నకొరటాల.. సక్సెస్ మీట్ లో సెన్సేషనల్ కామెంట్స్

Koratala

Koratala

యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకలో సినిమాను తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన సితార ఎంటర్టైమెంట్స్ నిర్మాత నాగవంశీ తో పాటు తెలుగు రాష్ట్రాల బయ్యర్స్ కూడా పాల్గొన్నారు.

‘దేవర’ టీం తో పాటు రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలో యంగ్ టైగర మాట్లాడుతూ ఈ సినిమా విజయంతో కొరటాల ఫేస్ లో సంతోషం, మనశ్శాంతి చూస్తున్నాను అన్నారు. అలాగే కొరటాల మాట్లాడుతూ ” సక్సెస్ లు చాలా సార్లు చూసాను గాని ఈ సక్సెస్ చాలా స్పెషల్ ” అని అన్నారు. దానికి కారణం లేకపోలేదు.కొరటాల శివ గత చిత్రం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లో ముల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య. ఆ సినిమా దారుణ పరాజయం పాలయింది. ఆ సమయంలో అందరు కొరటాల శివను నిందించారు. కొరటాల వల్లే సినిమా ప్లాప్ అయిందనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. వాటన్నిటికీ సక్సెస్ తోనే సమాధానం ఇవ్వాలని ఎదురుచూస్తున్న కొరటాల దేవర భారీ సక్సెస్ తో విమర్శకులకు చెక్ పెట్టారని  నెటిజన్స్ కొరటాలకు వంతు పాడుతున్నారు.

Show comments