అగ్గిపుల్లా, సబ్బు బిల్లా, కుక్క పిల్లా అంటూ శ్రీశ్రీ కవిత్వం చెప్పారు. ఆయన ఉద్దేశం అప్పట్లో వేరుగానీ… ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల లాగే కుక్క పిల్ల కూడా పెద్ద మార్కెట్ ప్రాడక్ట్ గా మారిపోయింది!
గత అయిదేళ్లుగా మన దేశంలో పెట్ మార్కెట్ జోరుగా పెరుగుతోందట. కుక్కల్ని పెంచుకునే శునక ప్రియులు 50 శాతం పెరిగారు. మార్జుల ప్రేమికుల ఇళ్లలో 40 శాతంపైగా పిల్లుల సంఖ్య ఎక్కువైందట! ముందు ముందు పెట్ యానిమల్స్ సందడి మరింతగా పెరిగిపోనున్న నేపథ్యంలో ‘సూపర్ టెయిల్స్ డాట్ కామ్’ అనే ఆన్ లైన్ వేదిక ప్రారంభమైంది. ఈ వెబ్ సైట్ లో పెంపుడు జంతువుల కోసం వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అలాగే, ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లుల కోసం వివిధ రకాల ఉత్పత్తులు కూడా ఆన్ లైన్ లో అమ్ముతారట. ‘సూపర్ టెయిల్స్.కామ్’లోకి లాగిన్ అయ్యి జంతు ప్రేమికులు డాక్టర్ల వైద్య సేవలు పొందటంతో పాటూ తమ పెట్స్ కోసం అవసరమయ్యే సమస్త సామాగ్రి కొనుగోలు చేయవచ్చు!
Read Also : ఆ 395 మందిలో ఒక ఒక్క ఇండియా నటి విద్యాబాలన్…!
పెంపుడు జంతువుల కారణంగా ఏర్పడ్డ మార్కెట్ చైనాలో, అమెరికాలో ఇప్పటికే బిలియన్ల డాలర్లు దాటింది. లక్షలాది మంది కుక్కలు, పిల్లుల కారణంగా జీవనోపాధి పొందుతున్నారు. అదే ఇండియాలోనూ రానున్న కాలంలో జరుగుతుందని నిపుణులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ ల వల్ల కూడా చాలా మంది పెంపుడు జంతువుల్ని ఇళ్లలోకి తెచ్చుకుంటున్నారు. ఈ కొత్త కుటుంబ సభ్యుల వల్ల పెట్ పేరెంట్స్ కి ఏర్పడే అవసరాలు తీర్చటమే ‘సూపర్ టెయిల్స్. కామ్’ టార్గెట్. ఈ బెంగుళూరు బేస్డ్ డిజిటల్ స్టార్ట్ అప్ అప్పుడే భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. దీపికా పదుకొణేతో సహా చాలా మంది ధనవంతులు, ప్రముఖులు ఈ కంపెనీలో మిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంత వరకూ ‘సూపర్ టెయిల్స్’ 2.6 మిలియన్ యూఎస్ డాలర్స్ మేర పెట్టుబడులు సాధించింది!
