Site icon NTV Telugu

Dandora : మంచి రిలీజ్ డేట్ పట్టిన దండోరా

Dandora

Dandora

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్ రిలీజైంది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో త‌వ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో ఈ ఏడాదికి డ్రామ‌టిక్‌గా ముగింపునిస్తున్నాం అనే క్యాప్ష‌న్‌తో రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు.

Also Read:sai Pallavi : తండేల్ తర్వాత కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తుంది?

ఇప్ప‌టికే వెర్స‌టైల్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచుకుంటోన్న దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు..ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Also Read:Tollywood : తెలుగబ్బాయిగా మారుతోన్న కన్నడ యాక్టర్

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వర్డ్ పేరజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ సినిమాను ఓవ‌ర్‌సీస్ రిలీజ్ చేస్తోంది.

Exit mobile version