Site icon NTV Telugu

Coolie : తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!

Cooli

Cooli

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీకి ఉన్న హైప్‌, కాంబినేషన్‌ను బట్టి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంటాయి. ‘2.O’ , ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. కానీ ముందు నుంచి కూడా రజినీకాంత్ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో రూ.20-30 కోట్ల బిజినెస్ చేశాయి. కాగా ఇప్పుడు ఆయన నెక్స్ట్ ‘కూలీ’ మూవీ బిజినెస్ అంతకుమించిన చేయనుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది..

తాజా సమాచారం ప్రకారం ‘కూలీ’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రూ.40-45 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర రైట్స్‌ను దక్కించుకునే అవకాశం కూడా ఉంది.

Exit mobile version