Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం..

Hhvm

Hhvm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సీరీస్ లు ఇవే

కాగా ఈ సినిమాను మొదట ఈ ఏడాది మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింట్ అప్పటికి ఫినిష్ అవకపోవడంతో విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు. చివరికి ఆ డేట్ కూడా రాదని తెలిసిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మే 30న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మే 30న వస్తుంది అన్నది నిర్మాత చేతిలో లేదట . చిత్ర హీరో పవన్ కళ్యాణ్ కు చెందిన మూడు, నాలుగు రోజులు షూట్ పెండింగ్ ఉందట. అది అయితే గాని రిలీజ్ లెక్క తేలదు. మరోవైపు మే 30న విజయ్ దేవర కొండ కింగ్ డమ్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఒకవేళ హరిహర వీరమల్లు వస్తే విజయ్ సినిమా వాయిదా వేయక తప్పదు. ఇప్పటికే పలుమార్లు రిలిజ్ వాయిదా వేసిన హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం నెలకొంది.

Exit mobile version