Site icon NTV Telugu

Sriram : ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో తెలియడం లేదు. తాజాగా కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అలియాస్ శ్రీరామ్ మృతి చెందారు. అర్ధరాత్రి అతను నిద్రిస్తున్న గది‌లో అగ్నిప్రమాదం జరిగింది. AC ఔట్ డోర్ యూనిట్‌లో మంటలు చెలరేగి, అలాగే ఒక్కసారిగా గది లోకి కూడా మంటలు వచ్చి దట్టమైన పొగ గది అంతా వ్యాపించింది. అందులో ఇరుకున్న శ్రీరామ్.. ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. బయటకు తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించి నప్పటికి బయటకు రాలేక ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందాడు శ్రీరామ్. దీంతో విషాదం లో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. ఇక విషయం తెలుసుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందా అని ఆరా తీస్తున్నారు.

Exit mobile version