హిందువుల ఇష్టదైవం హనుమాన్ జయంతి నేడు. హనుమాన్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామి జయంతి రోజున ఆయన భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో తన అభిమానులకు హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తన సతీమణి సురేఖతో కలిసి ఉన్న స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. ”అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమజ్జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మనవాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం ఋజువు చేసింది. ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కన పెడితే మన గుండెలో కొలువైన సూపర్ మాన్ లార్డ్ హనుమాన్’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక చిరంజీవి పోస్ట్ చేసిన పిక్ లో ఆయన తన భార్య సురేఖతో హనుమంతుని విగ్రహం ముందు కూర్చుని ఫోటో తీసుకున్నారు.
హనుమాన్ జయంతి… స్పెషల్ పిక్ పోస్ట్ చేసిన మెగాస్టార్
