NTV Telugu Site icon

Chiranjeevi: తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి చిరు సహా పలువురి విరాళాలు.. ఎవరెవరంటే?

Chiru Revanth

Chiru Revanth

Chiranjeevi Handed Over 50 Lakhs Cheque to Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖులు విరాళాలు అందచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షల విరాళం చెక్ అందచేశారు. ఇక రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల చెక్ ను కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు చిరంజీవి. రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందచేశారు చిరంజీవి. సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి 10 లక్షల రూపాయల డొనేషన్ చెక్ అందించారు సాయి దుర్గతేజ్. ఈ సందర్భంగా వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు సాయి దుర్గతేజ్. రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడటం పట్ల తన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు సాయి దుర్గతేజ్.

Megha Akash: పొలిటికల్ ఫ్యామిలీ కుర్రాడిని లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఇక మరోపక్క అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందచేశారు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు అలీ కూడా ఆ మేరకు చెక్ అందచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా ప్రకటించిన సినీ నటుడు విశ్వక్ సేన్ కూడా ఆ మేరకు చెక్ అందచేశారు. ఇక జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందచేశారు ప్రముఖులు.

Show comments