Site icon NTV Telugu

Chethabadi : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ‘చేతబడి’

Chetabadi

Chetabadi

ఈ మధ్య కాలంలో హారర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందుకే మేకర్స్ కూడా అలాంటి కధలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాణామతి బ్యాక్ డ్రాప్ లో ఒక రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని కథ రాసుకుని సినిమా చేస్తున్నారు. శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం చేతబడి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను గురించి తెలియజేస్తూ దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ..”చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్న.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి.

Also Read : Mahavatar Narasimha: మహావతార్ నరసింహ అరాచకం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టారంటే ?

అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్ గా ఉంటాయి. వర్షం పడినా అవి నేలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం” అని చెప్పారు. నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ..”ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చేతబడి చిత్రంలో రియలిస్టిక్ గా చూపించబోతున్నాం” అని అన్నారు.

Chethabadi

Exit mobile version