Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ

Prahaar

Prahaar

మడాక్ ఫిల్మ్స్ తక్కువ టైంలో బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ నుండి డిఫరెంట్ సినిమాలొచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ సంస్థ అధినేత దినేష్ విజన్ .. విజనరీ నిర్మాతగా పేరు గడించాడు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాదు.. సోషల్ ప్రియారిటీ, కంటెంట్ బేస్డ్ చిత్రాలు తీసి పాపులరయ్యింది మడాక్. హారర్ కామెడీలోకి ఎంటరయ్యాక నిర్మాణ సంస్థ పేరు ఇండియా వ్యాప్తంగా పాకింది. ఛావాతో సంస్థ క్రెడిబిలిటీ పెరిగింది. కానీ ఆ తర్వాత భూల్ చుక్ మాఫ్, తెహ్రాన్, పరమ్ సుందరి మొదలుకుని ఈ ఏడాదొచ్చిన కాక్ టైల్2 వరకు సాలిడ్ సక్సెస్ చూడలేదు మడాక్.

మడాక్ ఫిల్మ్స్ నుండి అక్టోబర్ నెలలో రెండు సినిమాలొస్తున్నాయి. ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నా పూజా మేరీ జాన్ ఓటీటీకి వెళ్లిపోగా.. ప్రహార్ దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న వస్తోంది. 2008లో ముంబయి ఉగ్రదాడుల తర్వాత జరిగిన న్యాయ పోరాటం చుట్టూ తిరుగుతోంది ఈ కథ. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ రోల్ చేస్తున్నాడు రాజ్ కుమార్ రావ్. వామికా గబ్బీ హీరోయిన్.. ప్రహార్ తర్వాత మడాక్ నుండి లేడీ ఓరియెంట్ ఫిల్మ్స్ ఈత అండ్ శక్తి షాలిని సిద్ధమౌతున్నాయి. ఛావా తర్వాత విక్కీ కౌశల్‌తో మైథాలజీ ఫిల్మ్ మహావతార్ మూవీని ఎనౌన్స్ చేసింది మడాక్ ప్రొడక్షన్ హౌస్.. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. రీసెంట్లీ ఈ మూవీ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత దినేష్ విజన్. 2027 జనవరి ఎండింగ్ నుండి స్టార్ట్ చేసి జూన్‌లో షూట్ ఫినీష్ చేస్తామని వెల్లడించారు. నెక్ట్స్ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ చేస్తారట. అలాగే శ్రద్దా కపూర్ స్త్రీ3 2028 రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.