NTV Telugu Site icon

HoneyRose : ‘హానీరోజ్’పై లైంగిక వేధింపులకు పాల్పడిన ‘బిజినెస్ మెన్’

Honey

Honey

మలయాళ ముద్దుగుమ్మ హానిరోజ్ నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది హాని. ప్రస్తతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది హాని రోజ్. నిత్యం ఫోటో షూట్స్, ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసే హాని రోజ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

Also Read : NTRNeel : రంగం సిద్ధం.. సెట్స్ పైకి ‘ఎన్టీఆర్-నీల్’ సినిమా

తనను కేరళకు చెందిన ఓ బిజినెస్ మెన్ కొద్దీ నెలలుగా నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడిస్తూ, తనను వేధిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టింది హాని రోజ్. గతంలో ఓ సారి సదరు వ్యక్తి నిర్వహించిన ఓ ఈవెంట్ కు తనను పిలిస్తే తానూ వేరే కారణాల వలన హాజరు కాలేదు. ఆ సంఘటను మనసులో పెట్టుకుని అప్పటి నుంచి అతడు నాపై ప్రతీకారం తీసుకునేందుకు తన వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ తన పరువుకు భంగం కలిగిలించి, తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తెలుపుతూ, తాను ఎక్కడికి వెళ్తే అక్కడకి వస్తున్నడని, అతడిపై చట్టపరంగా పోరాడుతానని ఓ పోస్ట్ పెట్టింది. డబ్బుంటే ఏదైనా చేయచ్చా. భారత న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు, 20 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్న తాను ఆ బిజినెస్ మాన్ వేధింపులను ఎందుకు భరించాలి అని హనీ పోస్ట్ చేసింది. మరోవైపు హనీ రోజ్ ను అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్ట్ చేసారు.

Show comments