NTV Telugu Site icon

‘బిగ్ బాస్ 5’ సెప్టెంబర్ కు వాయిదా!?

Bigg-Boss

Bigg-Boss

‘బిగ్ బాస్4’ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన నేపథ్యంలో ‘బిగ్ బాస్ 5’ను అనుకున్న టైమ్ కే ఆరంభించాలని భావించారు నిర్వాహకులు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ఆలస్యంగానే మొదలవుతుందంటున్నారు. గత ఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు ఆలస్యంగా మొదలైంది ‘బిగ్ బాస్4’. పోటీదారులను ఎంపిక చేసి వారిని మూడు వారాలపాటు క్వారంటైన్ చేసి మరీ ఆరంభించారు. ఇక ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి ‘బిగ్ బాస్5’ ను మొదలెట్టాలని భావించారు. పోటీదారులకు సంబంధించి ఎంపిక కూడా మొదలెట్టారు. ఎప్పటిలాగే చిన్నస్థాయి సెలబ్రెటీలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యూట్యూబ్ స్టార్స్, పేరున్న సాంకేతిక నిపుణులు ‘బిగ్ బాస్5’లో చోటు దక్కించుకోబోతున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ‘బిగ్ బాస్’ షో ఆలస్యం అవుతుందంటున్నారు. సెప్టెంబర్ లో ఆరంభించి డిసెంబర్ కి ముగించాలనుకుంటున్నారట. ఈ ‘బిగ్ బాస్ 5’కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. మరి సెప్టెంబర్ కు అయినా ఆరంభం అవుతుందా? లేక మరింత వాయిదా పడుతుందా అన్నది చూడాలి.