వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరోలైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భైరవం సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం, జులై 27 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో!
Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు
తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉండే వారాహి అమ్మవారి గుడి ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ (జయసుధ) తన మనవడు గజపతి (మంచు మనోజ్), అతని స్నేహితుడు వరద (నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) ముగ్గురినీ సమానంగా పెంచుతుంది. ఈ క్రమంలో ఓ మంత్రికి దేవాలయ భూమిపై కన్ను పడుతుంది.
Also Read : Chitrapuri Colony: చిత్రపురి కాలనీపై సందేహాలున్న వారంతా మీటింగుకు రండి !
నాగరత్నమ్మ మరణం తర్వాత ట్రస్టీగా శ్రీనుని గెలిపిస్తారు గజపతి, వరద.
అయితే ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి ఎందుకు చంపాడు? పోలీసులకు అబద్ధం చెప్పి, వరద భార్య (దివ్య పిళ్ళై) దగ్గర చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి శ్రీనుకి ఎందుకు వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే భైరవం సినిమా చూడాల్సిందే!
