Site icon NTV Telugu

Barabar Premistha : బరాబర్ ప్రేమిస్తానంటున్న యాటిట్యూడ్ స్టార్

Barabar Premistha

Barabar Premistha

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ అంటూ సాగే పాట విడుదల

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ అందాల హీటు..

ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది.

Also Read : Tollywood : కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ఓకే.. ఫెడరేషన్ ప్రెసిడెంట్

ఇక ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం నుంచి ‘గుంజి గుంజి’ అనే పాటను రిలీజ్ చేశాను. సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లో ఈ చిత్రం రాబోతోంది. ధృవన్ ఈ మూవీకి మంచి సంగీతం ఇచ్చారు. ధృవన్ నా మూవీకి కూడా పని చేస్తున్నారు. రోల్ రైడా మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటను అందరూ ఎంజాయ్ చేసేలా చిత్రీకరించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. మేకర్స్ అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి వైఆర్ శంకర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.

Exit mobile version