Site icon NTV Telugu

Happy Journey : ఆసక్తికరంగా “హ్యాపీ జర్నీ” పోస్టర్

Happy Journey

Happy Journey

ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ హ్యాపీ జర్నీ. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, కెమెరామెన్ అరుణ్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ” ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన ఈ డైరెక్టర్ ని అభినందిస్తున్నాను . ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యతల మీద స్పృహ ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను ఎంతవరకైనా సహకరిస్తాను. అని అన్నారు. హరి ప్రసాద్ కోనే, ఇషాని గోష్, దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత గంగాధర్ పెద్ద కొండ.

Exit mobile version