విలక్షణ నటుడు ఆదిత్య ఓం బందీ అనే చిత్రంతో గత వారం ఆడియెన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి థియేటర్ లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బందీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్‌లో.. హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘బందీ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. మీడియా ఇంకా సపోర్ట్ చేస్తే మరింత మందికి చేరుతుంది. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాను. మా సినిమాను ఇంతలా ఆదరించి సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.