Site icon NTV Telugu

Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..?

Balayya

Balayya

Mokshagna : నందమూరి నటసింహం బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య తన ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్నారు.అయితే కొడుకు ఎంట్రీ ఓ పవర్ ఫుల్ సినిమాతో ఉండాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఏడాదిలోనే నందమూరి మోక్షజ్ఞ మూవీ లాంచ్ ఈవెంట్ జరిపేందుకు ప్రయత్నాలు మొదలయినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది .మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయే కథ ఫైనల్ అవ్వగానే మూవీని వెంటనే ప్రారభించునున్నట్లు సమాచారం.అయితే మోక్షజ్ఞ మొదటి మూవీ దర్శకుడు ఎవరు అవుతారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also :Manchu Manoj : వేంకటేష్ మూవీలో మంచు మనోజ్..క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్న ఆ దర్శకుడు..?
తనకు వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.అయితే త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.అందరూ ఊహించినట్లుగానే బోయపాటినే దర్శకుడు అవుతాడా లేక మరో కొత్త దర్శకుడు మోక్షజ్ఞను లాంచ్ చేసారా అనేది చూడాలి.అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో హీరోగా రాణించాలంటే ఒక్క బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి..మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదగాలంటే తాను చేసే మొదటి సినిమా అద్భుత విజయం సాధించాలి.ఇవన్నీ ఎంతో ఆలోచించిన బాలయ్య మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతను సరైన దర్శకుడికి ఇవ్వాలని చూస్తున్నాడు.

Exit mobile version