గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తన తదుపరి సినిమాNBK111 చిత్రీకరణలో ఒక భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తుండగా మోకాలుకి తీవ్ర గాయమైంది. దాంతో వెంటనే బాలకృష్ణను కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మోకాలుకి ఎక్స్-రే, స్కాన్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు.
రిపోర్ట్స్ అనంతరం వైద్యులు మోకాలుకి చిన్న సర్జరీ అవసరపడుతుందని బాలకృష్ణకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు బాలయ్య. తన సొంత ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ కోసం బాలకృష్ణ ఈ ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అత్యవసరంగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఫ్యామిలీ డాక్టర్ల సంరక్షణలో చికిత్స తీసుకోనున్నారు. సర్జరీ అనంతరం కొన్ని రోజులు పాటు షూటింగ్స్ కు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. బాలయ్యకు గాయం కావడంతో చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

