కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. అసెంబ్లీలో ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా, కొంచెం వ్యంగంగా మాట్లాడినట్లు స్ఫురించింది. వెంటనే మెగాస్టార్ చిరంజీవి, అసలు నిజా నిజాలు ఏమిటంటే అనే విషయం మీద ఒక ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం మీద సీరియస్ అయిన మెగా అభిమాన సంఘాలు, బాలకృష్ణతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్లో చిరంజీవి అభిమాన సంఘాల వారు సమావేశం అయ్యారు.
Also Read :OG : తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గింపు?
అంతేకాక, బాలకృష్ణ మీద తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సుమారు 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో, అలాంటి పనులు చేయవద్దని వారిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని అఖిల భారత చిరంజీవి యువత అధికారికంగా ఒక సందేశాన్ని కూడా రిలీజ్ చేసింది. అయితే మెగాస్టార్ చిరంజీవి వారించడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది. ఇక వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తిరిగి వచ్చారు. తాజాగా జరిగిన యాంటీ పైరసీ మీటింగ్‌లో ఆయన ఇతర హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి పాల్గొన్నారు.
