Site icon NTV Telugu

‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమం ద్వారా బాలుకు సంగీత నివాళి !

Bala Gana Gandharvulu Musical Tribute to SP Balu

ఈ సంవత్సరం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ ఎఫ్.ఎం. ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పీబీ గారి జ్ఞాపకార్థం ‘బాల గాన గాంధర్వులు’ పేరుతో పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు బాలుగారి సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. మ్యాజిక్ 106.4 ఎఫ్‌ఎమ్‌ ఆదర్వ్యంలో ఈ సంగీత నివాళి నిర్వహించబడింది. ఈ పోటీ ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారి వీడియోలను వాట్సాప్ ద్వారా మరియు మ్యాజిక్ ఎఫ్.ఎం డిజిటల్ పేజీలకు పంపించారు.

Read Also : “తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి

బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్, కోటి, ఆర్‌పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, కెఎమ్ రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు ‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమాన్ని అభినందించి ప్రోత్సహించారు. అంతే కాదు ఈ కాంటెస్ట్ కు సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి టాప్ 5 సింగర్స్ ను ఎంపిక చేశారు. టాప్ 5 ఫైనలిస్టుల్లో ప్రియాంక ప్రభాకరన్, సంజన, వెంకట శ్రీకీర్తి, ధ్రువ ప్రజ్వల్, తన్విలు నిలవగా విజేతలుగా ప్రియాంక ప్రభాకరన్, సంజన బహుమతులు కైవసం చేసుకున్నారు. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం రోజున ‘బాల గాన గాంధర్వులు’ విజేతలు మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ స్టూడియోలో.. ఆర్జే రవళి, ఆర్జే కళ్యాణ్, ఆర్జె నాటీ నాని, ఆర్జె ప్రతీక చేతులు మీదగా ట్రోఫీలు అందుకున్నారు. అలాగే విజేతలకు 5000/- విలువైన గిఫ్ట్ ఓచర్లు కూడా అందజేశారు.

Exit mobile version