NTV Telugu Site icon

Bahishkarana : జూలై 19 నుంచి అంజలి ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Bahishkarana

Bahishkarana

Bahishkarana Starring Anjali to premiere on ZEE5 on July 19th 2024: యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

Film Chamber: సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి కండిషన్స్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!

ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ. ZEE5 ప్రేక్షకులు ఆమె చేసిన ప్రయాణం, ఆమెలో వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అంజలితో పాటు రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలలో నటించారు.

Show comments