Site icon NTV Telugu

Bahishkarana : ఆకు వక్క అందిస్తా, మూడు పూటలా స్వర్గం చూపిస్త అంటున్న పుష్ప

Bahishkarana

Bahishkarana

Bahishkarana Official Teaser Released: యాబైకి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘బహిష్కరణ’ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ప్రపంచంలో లొంగిపోయేది రెండిటికీ ఒకటి సొమ్ముకి రెండు ఆడదాని సోకుకి అంటూ అంజలి చెబుతున్న డైలాగుతో టీజర్ ప్రారంభమైంది.

Saindhav Disease: సైంధవ్ సినిమాలో అరుదైన జబ్బు.. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం టీడీపీ అభ్యర్ధన!

మరోపక్క ఆడదాన్ని చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా? ఆడది మగాడి జీవితంలో వచ్చేటప్పుడునిండు పౌర్ణమిలా ఉంటుంది సమయం గడిచే కొద్దీ చీకటికి అమ్ముకుంటుంది అంటూ రవీంద్ర విజయ్ వాయిస్ కూడా వినిపిస్తోంది. ఆకు వక్క అందిస్తా మీకు మూడు పూటలా స్వర్గం చూపిస్త అని అంటూనే రక్తపాతాన్ని చూపిస్తున్నారు. బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా అనిపిస్తున్నాయి. సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో సిరీస్ లో కనిపించనుంది. .

Exit mobile version