NTV Telugu Site icon

Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్

Bahirbhoomi

Bahirbhoomi

Bahirbhoomi” First Look Launched: సింగర్ నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకి “బహిర్భూమి” అనే వింత టైటిల్ ఫిక్స్ చేశారు. మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోండగా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ మిగతా వాళ్లు టాయిలెట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నారు. మేము ధైర్యంగా బహిర్భూమి అని సినిమాకు పేరు పెట్టాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తాం అన్నారు.

Jani Master: ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డా.. వైరల్ అవుతున్న జానీ మాస్టర్ పాత వీడియో

దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ మేము బహిర్భూమి అని టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది, ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం. హీరోయిన్ రిషిత చాలా బాగా నటించింది. మా మూవీకి మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు. హీరో నోయల్ మాట్లాడుతూ – చిన్న మూవీస్ చేయొద్దు అనుకుంటున్న టైమ్ లో వచ్చిన చిత్రం బహిర్భూమి. బహిర్భూమి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. చాలా మంచి మూవీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి అన్నారు. నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శీను, విజయ రంగరాజు, జబర్దస్త్ ఫణి, జయ వాహిని ఆనంద్ భారతి, కిరణ్ సాపల, పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Show comments