Site icon NTV Telugu

“డియర్ మేఘ” సాంగ్… సిద్ శ్రీరామ్ మరో క్లాసికల్ హిట్

Bagundhi Ee Kaalame Lyriccal Video Song from Dear Megha

లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “బాగుంది ఈ కాలమే” అనే మెలోడియస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ తప్పకుండా మరో క్లాసికల్ హిట్ సాంగ్ అవుతుంది. ఇప్పటికే సిద్ శ్రీరామ్ తన ఖాతాలో ఎన్నో అద్భుతమైన లవ్ సాంగ్స్ ను వేసుకున్నారు. ఇక ఈ సాంగ్ కూడా అందులో చేరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ కు కృష్ణ కాంత లిరిక్స్ అందించగా, గౌర హరి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

Read also : ఇంతలోనే ప్రకాశ్ రాజ్ లో ఎంత మార్పు!

ఇక ఇందులో అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించారు. ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ లో అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న “డియర్ మేఘ” ఆడియో రైట్స్ ను సిల్లీ మాంక్స్ మ్యూజిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా విడుదలై మనసులను హత్తుకుంటున్న “బాగుంది ఈ కాలమే” లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version