Site icon NTV Telugu

Bheems Ceciroleo: భీమ్స్ పేరులో ‘సిసిరోలియో’ అంటే ఏంటో తెలుసా?

Bheems

Bheems

సంగీత దర్శకుడు భీమ్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట లిరిసిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించాడు. తర్వాత సాంగ్స్ కంపోజ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి ఎన్నో హిట్ సినిమాలు అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు మ్యాడ్ స్క్వేర్ సినిమాతో ఆయన తనదైన శైలిలో పాటలు అందించి సూపర్ హిట్ కొట్టించాడు.

Trivikram : త్రివిక్రమ్ సీనియర్ హీరోతోనే చేస్తాడా..?

అయితే, భీమ్స్ పేరు వెనుక సిసిరోలియో అనే పేరు కూడా ఉంటుంది. ఈ పేరు ఏమిటని చాలామందికి అనుమానం కలగవచ్చు, కానీ అది ఆయన తండ్రి ఇష్టంగా పెట్టిన పేరు. రోమన్ రచయిత మార్కస్ తుల్లియస్ సిసెరో, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో పేర్లను కలిపి ఆయన తన కుమారుడికి సిసిరోలియో అనే పేరు పెట్టారు. అయితే ఇది ఇంటి పేరు అనుకుని చాలా మంది పొరబడుతూ ఉంటారు కానీ అసలు నిజం ఇదన్నమాట.

Exit mobile version