NTV Telugu Site icon

Pawan Kalyan- Ram Charan: బాబాయ్ అబ్బాయ్ బాండింగ్.. భలే ముచ్చటేస్తోంది బాసూ!

Pawan Kalyan Ram Charan

Pawan Kalyan Ram Charan

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను.

Pawan Kalyan: టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. రామ్ చరణ్ మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు.. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.

Show comments