Site icon NTV Telugu

Baahubali : 2017లోనే రాజమౌళికి రీ రిలీజ్ ఐడియా?

Vikram Narayana Rao Rajamouli

Vikram Narayana Rao Rajamouli

ఇండియన్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారు తెర‌కెక్కించిన ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి, రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali The Epic 2025) పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆలోచ‌న‌ను ఏడేళ్ల‌ క్రిత‌మే లాయిడ్ గ్రూప్స్ అధినేత, ధనిక భారత్ విజన్ సృష్టి కర్త విక్రం నారాయణ రావు సూచించారు.

2017 మే 6న, ‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజుల‌కే, ఆయన ట్విట్టర్‌లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ – “బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే సినిమాలా రిలీజ్ చేయండి. ఇది ఇప్పటి వరకు సినిమా చరిత్రలో జరగని అద్భుతం అవుతుంది. కనీసం 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులకు మరో మాయాజాలమైన అనుభవం ఇవ్వవచ్చు” అని సూచించారు. పదేళ్ల తర్వాత ఆ ఆలోచ‌న‌ను రాజ‌మౌళి నిజం చేస్తుండ‌టంతో, విక్రం నారాయణ రావు ఏడేళ్ల‌ క్రిత‌మే చేసిన ఈ ఆలోచ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Exit mobile version