కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ హిట్ కోసం తపిస్తున్నఅక్కినేని అఖిల్‌కు లెనిన్ మాసివ్ హిట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అఖిల్‌కు హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నాగార్జున.. అనుకున్నట్టే కొడుక్కి సూపర్ హిట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలలో లెనిన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
విడుదలైనప్పటి నుంచి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది లెనిన్. అఖిల్ నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. దాంతో రెండు, మూడవ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టాడు అయ్యగారు. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల భారీ మైలురాయిని అందుకుంది. అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా మొదటి రూ. 100 కోట్ల గ్రాసర్ చిత్రంగా రికార్డు సృష్టించింది. సినిమాకు మొదటి రోజు నుంచే లభించిన పాజిటివ్ టాక్, అఖిల్ పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, మరియు మాస్ ఎలిమెంట్స్ ఈ వసూళ్లకు ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ విజయం అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. గతేడాది తండేల్ తో అన్నఅక్కినేని నాగ చైతన్య వంద కోట్ల క్లబ్ లో చేరగా లెనిన్ తో అయ్యగారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

